http://www.framingtheworld.com/m2z.html
4 వేల సంవత్సరాల క్రితం, మెసోపొటేమియాలో అబ్రహాముకు దైవం కనిపించి అతనితో ఇలా పలికాడు, “ నీ దేశము నుండియు, నీ బంధువుల నుండియు బయటకి రమ్ము, నేను చూపించిన ప్రదేశానికి పొమ్ము. నేను నీ ద్వారా ఓ గొప్ప దేశమును తయారుచేసెదను.” అబ్రహాము దేవుని ఆజ్ఞను పాటించి, ఆనందభూమి అయిన కనాను వచ్చి, తన కుమారుడు ఐజాక్, మనవడు యాకోబులతో అక్కడ నివసించాడు. యాకోబుకు తరువాత ఇశ్రాయేలుగా పేరును మార్చారు.
కనాను ప్రాంతంలో కరవు కారణంగా, ఇశ్రాయెల్, అతని 12 కుమారులు కిందనున్న ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ వారొక శక్తివంతమైన దేశంగా వృద్ధి చెందారు. ఐగుప్తీయులు శక్తివంతమైన ఇశ్రాయెల్ తమ మధ్య ఉన్నందుకు భయపడి, వారిని బానిసలుగా చేసి, బానిసత్వంతో వారి జీవితాలను దుఃఖమయం చేసారు. ఐగుప్తులో 430 ఏళ్ళ బానిసత్వం తరువాత, వారికి మోషే దాస్యవిముక్తి కల్పించగా, ఎర్ర సముద్రం దాటి, అరేబియాలోకి వెళ్ళారు. వారక్కడ సీనాయి పర్వతం వద్ద దైవ చట్టాన్ని అందుకున్నారు.
మోషేతో ఐగుప్తుకు వెళ్ళిన తరాన్ని, దేవుని పట్ల వారికి విశ్వాసం లేకపోవడం వల్ల వారిని ఆనందభూమిలోకి రానివ్వలేదు. వాళ్ళను బలవంతంగా 40 ఏళ్ళు అరణ్యవాసం చేయించారు. అయితే దేవునిపై విశ్వాసం గల కొత్త తరం వృద్ధి చెంది, యేహోషువాతో కలిసి ఆనందభూమిలో అడుగుపెట్టారు.
400 సంవత్సరాల పాటు, ఇశ్రాయేలు యొక్క 12 జాతులని, న్యాయాధికారులు, మోషే చట్టం ప్రకారం పాలించారు. ఇతర దేశాలలాగే వారికి రాజొకరు ఉండాలని అనిపించినప్పుడు, దేవుడు సౌల్‌ని వారి రాజుగా నియమించాడు. సౌల్ వారిని 40 ఏళ్ళు పాలించాడు, తరువాత దావీదు రాజు 40 సంవత్సారాలు, ఆ తరువాత, దావీదు కొడుకు సొలోమోను 40 ఏళ్ళు పాలించారు. సోలోమోను హయాములో ఇశ్రాయేలు రాజ్యం పతాక స్థాయికి చేరుకుంది, మొదటి మందిరాన్ని నిర్మించారు, అయితే వృద్ధ దశలో ఉన్న సోలోమోను మనసు దేవుడిపై లేదు కాబట్టి, దేవుడు అతని 10 జాతులు, తన కుమారుడిచే పాలించబడవని చెప్పారు.