పత్రికా విభాగం కోసం YouTube

గణాంకాలు మరియు మీరు వెతుకుతున్న వీడియోలను త్వరగా కనుగొనండి, అంతేకాకుండా వాటికి సంబంధించిన క్రెడిటింగ్ మరియు ప్రసార మార్గదర్శకాలను కూడా చూడండి.

YouTube ఆవశ్యకతలు

పత్రికల వారు YouTube వీడియోలను వాణిజ్యేతర అవసరాల కోసం ఉపయోగించడం

యాజమాన్యం మరియు క్రెడిట్

సైట్‌లో ప్రదర్శించబడుతున్న కంటెంట్ యొక్క హక్కులు YouTube ఛానెల్ యజమానుల స్వంతం. మీరు ప్రదర్శించాలనుకుంటున్న మరియు/లేదా సూచన వలె ఉపయోగించాలనుకుంటున్న వీడియో ఏదైనా మీకు కనిపిస్తే, మీరు నేరుగా వారినే సంప్రదించాల్సిందిగా మేము సూచిస్తున్నాము. ప్రసారం లేదా వెబ్‌క్యాస్ట్‌లో YouTube వీడియోని ప్రదర్శించే సమయంలో, స్క్రీన్‌లో మరియు మౌఖికంగా సంబంధిత కంటెంట్ యజమాని యొక్క వినియోగదారు పేరు మరియు అసలు పేరును పేర్కొనండి.

YouTube ఛానెల్ యజమానిని సంప్రదించడం

YouTube వినియోగదారు పేరుని క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ వినియోగదారు ఛానెల్ యొక్క ప్రధాన పేజీకి వెళతారు. అక్కడ, మీరు YouTube యొక్క ఆన్-సైట్ సందేశ వ్యవస్థను ఉపయోగించి ఛానెల్ యజమానిని సంప్రదించవచ్చు, అయితే మీరు తప్పనిసరిగా మీ స్వంత Google ఖాతాకు లాగిన్ చేసి ఉండాలి. “పరిచయం” ట్యాబ్‌ని క్లిక్ చేసి, “సందేశం పంపు” ఎంపికను ఎంచుకున్న తర్వాత, ఎలక్ట్రానిక్ ఫారమ్‌ని పూరించండి.

YouTubeలో ఏమి జరుగుతోంది

ఇంకేవైనా అదనపు పాత్రికేయ విచారణల కోసం, సంప్రదించండి press@google.com