Movie: Prema Desam
Lyrics: Bhuvanachandra
Music: A.R.Rehman
Artwork: V.G.Nath
Song:
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవులా తేనెలే తేవే.
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవులా తేనెలే తేవే.
కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేల.
కనుల పైన కలలే వాలి సోలి పోయే వేల.
వెన్నెల ...
ఆశ ఎన్నడు విడువద! అడగరాదని తెలియద!
నా ప్రాణం చెలియా నీవే లే.
విరగబూసిన వెన్నెల వదిలి వేయకే నన్నిలా.
రారాదా ఎద నీదే కాదా!
నిదురనిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావ!
వెన్నెల ...
మంచు తెరలో అలసిపోయి మధన సంధ్య తూగేనే.
పుడమి వొడిలో కలలు కంటూ పాప నీవు నిదురపో.
మల్లె అందం మగువకేరుక మనసు బాధ తెలియద!
గుండె నిండా ఊసులే నీ ఎదుట నుంటే మౌనమే.
జోల పాట పాడినానే నిదురలేక వాడిన..
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవులా తేనెలే తేవే.
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవులా తేనెలే తేవే.
కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేల.
కనుల పైన కలలే వాలి సోలి పోయే వేల.
వెన్నెల ...
thanks
1566chandra 1 month ago
nice song
businessinsexpo 7 months ago